1 2 3 4 5

ప్రభాస్ కే ఎక్సక్లూజివ్ గా హన్సిక



సినిమా డైరెక్టర్ మెహర్ రమేష్ పై ఉన్నసోదర గౌరవంతో తాను ఆ సాంగ్ చేశానని ఇక సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేయబోనని హన్సిక ప్రకటించింది. రీసెంట్ గా ఆమెకు ఓ తమిళ నిర్మాత తన సినిమాలో ఐటమ్ సాంగ్ లో డాన్స్ చేస్తే కోటి పాతిక లక్షలు ఇస్తానని కబురు చేశారు. దానికి ఆమె అలా స్పందించింది. అప్పటికీ ఆ చిత్రంలో విక్రమ్ హీరో. ఆ సినిమా పేరు రాజపతి. విక్రమ్ సైతం ఆమెను రిక్వెస్ట్ చేసినా ససిమేరా అంది. ఇక అప్పట్లో ఆమె ప్రభాస్ సరసన భిల్లా చిత్రంలో ఐటం సాంగ్ చేసింది.కానీ ఆ సాంగ్ సినిమాలో హైలెట్ కాలేదు. ఆ తర్వాత తెలుగులో ఆమెకు కెరీరే లేకుండా పోయింది.

మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ఆమె కందిరీగ చిత్రంతో ఇక్కడ హిట్ కొట్టి నిలబడే ప్రయత్నం చేస్తోంది. అలాగే తమిళంలో ఆమె చేసిన చిత్రాలు సైతం పెద్దగా ఆడలేదు. దాంతో అక్కడే అప్పుడే ఆమెకు ఐటం సాంగ్ ఆఫర్స్ రావటంతో విస్తుపోతోంది. ఐటం సాంగ్ చేస్తే శ్రియ లాగే తన పరిస్దితి కూడా సినిమాలు లేని పొజీషన్ కి వచ్చేస్తానని భయపడుతోంది. అప్పట్లో శ్రియ ..వడివేలు చిత్రంలో ఐటం సాంగ్ చేసి చేతులారా కెరీర్ ని నాశనం చేసుకుంది. దాంతో ఇక హన్సిక ఐటం సాంగ్ అంటే ప్రభాస్ చిత్రమే అని గుర్తు చేసుకోవాలి ఆమె అభిమానులు.

English summary:

Sexy Actress Hansika rejected to do an item song in Vikram's movie Rajapattai. Vikram personally requested Hansika for this song as he wants a popular face. Despite being a big admirer of Vikram, she denied to do it and stated that she would never feature in any item song.


Responses

0 Respones to "ప్రభాస్ కే ఎక్సక్లూజివ్ గా హన్సిక"

Post a Comment

 
Return to top of page Copyright © 2011 | By SajanVinuthna.Velamati |All Rights Reserved |