1 2 3 4 5

ప్రభాస్ పర్సనాలిటీకి, ఇమేజ్ కి ఫర్ ఫెక్ట్ మ్యాచ్: రెబల్...!



యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడుగా హిట్ చిత్రాల దర్శకుడు లారెన్స్ దర్శకత్వంలొ శ్రీ బాలాజీ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాతలు జె భగవాన్, జె పుల్లా రావు నిర్మిస్తున్న భారీ చిత్రం ‘రెబల్’ ఈ చిత్రం చిత్రీకరణ లో భాగంగా రెండు షెడ్యూల్స్ దిగ్విజయంగా పూర్తి చేసుకొని మూడవ షెడ్యూల్ ఈ నెల 15 నుండీ హైదరాబాదులో ప్రారంభం కానుంది. ఈ చిత్ర విశేషాలను తెలియజేయడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర నిర్మాతలు జె పుల్లా రావు, కె భగవాన్ మాట్లాడుతూ ఈ నెల 15 నుండి హైదరాబాదు లో మూడవ షెడ్యూల్ ప్రారంభమై ఏకధాటిగా చిత్రం పూర్తి అయ్యేవరకూ హైదరాబాద్, వైజాక్, బ్యాంకాక్ లలో జరుగుతుందని తెలిపారు.అలాగే ఈ చిత్రంలో ప్రభాస్ తో తమన్నా తొలిసారిగా నటిస్తుందని ,మరో కథానాయకిగా దీక్షాసేథ్ నటిస్తుందని,తెలిపారు.

చిత్ర దర్శకుడు లారెన్స్ మాట్లాడుతూ ఓ సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందివ్వాలనే పట్టుదలతో రూపొందుతోన్న ఈ చిత్రానికి ప్రభాస్ తన పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు.ప్రభాస్ పర్సనాలిటీకీ, ప్రభాస్ ఇమేజ్ కీ పర్ఫెక్ట్ గా సరిపోయే సబ్జెక్ట్ ఇది. ఈ చిత్రంలోని హీరో పాత్రను ప్రభాస్ తప్ప మరెవ్వరూ చేయలేరు.ప్రభాస్ ఈ చిత్రంలో అత్యద్భుతంగా నటిస్తున్నారు అని తెలిపారు. ప్రభాస్ మాట్లాడుతూ లారెన్స్ ఈ చిత్రాన్ని ఎక్స్ ట్రార్డినరీగా తీస్తున్నారు. ‘మిస్టర్ పర్ఫెక్ట్ ’తర్వాత వస్తున్న ఈ సినిమాలో నా లుక్ డిఫరెంట్ గా వుంటుంది. షూటింగ్ చేస్తున్నప్పుడే ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఏర్పడింది అని తెలిపారు. ఈ ఈ చిత్రానికి తమన్ తన సంగీత బాణీలను అందిస్తున్నారు.
English summary:
After a long gap choreographer Lawrence directing a Telugu film with hero Prabhas. Tamanna and Deeksha Seth doing main female lead. The movie titled as 'Rebel'. Rebel star Krishnam Raju playing Prabhas father role.



Responses

0 Respones to "ప్రభాస్ పర్సనాలిటీకి, ఇమేజ్ కి ఫర్ ఫెక్ట్ మ్యాచ్: రెబల్...!"

Post a Comment

 
Return to top of page Copyright © 2011 | By SajanVinuthna.Velamati |All Rights Reserved |